Monday, December 23, 2024

బాబీ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలలో…

- Advertisement -
- Advertisement -

అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుసగా మూడు విజయాలను సొంతం చేసుకున్న స్టార్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అయితే సంక్రాంతి కానుకగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటిస్తారని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు కానీ ఫిల్మ్‌మేకర్స్ టైటిల్‌ను ప్రకటించలేదు. ఇక ఈ సినిమాలో స్టార్ హీరో బాలకృష్ణను దర్శకుడు బాబీ రెండు డిఫరెంట్ పాత్రల్లో చూపించబోతున్నాడట.

మొదటి పాత్రలో రెగ్యులర్ లుక్‌లో కనిపించబోతున్న బాలయ్య రెండో పాత్రలో మాత్రం 60 సంవత్సరాల వయసులో కనిపించబోతున్నాడని తెలిసింది. ఈ సినిమాలో బాలకృష్ణ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో సర్‌ప్రైజింగ్ లుక్‌తో కనిపించబోతున్నాడని సమాచారం. 60 సంవత్సరాల గెటప్‌లో బాలయ్య కనిపించేది కొద్ది సమయం అయినా అబ్బురపడే విధంగా ఈ సన్నివేశాలు ఉంటాయని తెలిసింది. ఇక చిరంజీవితో బ్లాక్‌బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది కావడంతో దీనిపై ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News