Thursday, December 26, 2024

నిమ్మ చెట్టు కింద నిధి దాచిన ముసలవ్వ, తీరా తవ్వి చూస్తే…!

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: ఓ వృద్ధురాలు బంధువుల ఇంటికి వెళ్తుండడంతో తన దగ్గర ఉన్న రెండు లక్షల రూపాయలు ఎక్కడ పెట్టాలో అర్థంకాలేదు… తన ఇంటి ఆవరణంలో ఉన్న నిమ్మ చెట్టు కింద తవ్వి ఆ నగదును దాచి పెట్టి వెళ్లిపోయింది. మళ్లీ ఇంటికి వచ్చి నగదు కోసం తవ్వగా కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. మొదటి ఆ వృద్ధురాలు చెప్పిన మాటలు విని పోలీసులు పట్టించుకోలేదు. విచారణలో భాగంగా ఇక్కడే డబ్బులను పాతిపెట్టానని చెప్పడంతో పోలీసులు దానికి కొంచెం దూరంలో తవ్వడంతో ప్లాస్టిక్ డబ్బా కనిపించింది. ప్లాస్టిక్ డబ్బాను బయటకు తీసి ఓపెన్ చేసి చూడగా అందులో రెండు లక్షల రూపాయలు కనిపించడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండంలో జగ్గుతండాలో జరిగింది. వృద్ధురాలు తమ్మిశెట్టి రంగమ్మకు డబ్బులో ఎక్కడ భద్రపరచాలో పోలీసులు వివరంగా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News