Monday, December 23, 2024

పెద్దమ్మ గుడి సమీపంలో రోడ్డు ప్రమాదం: బౌన్సర్ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. బైక్‌ను కారు ఢీకొట్టడంతో బౌన్సర్ ఘటనా స్థలంలో దుర్మరణం చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తారక రామ్ (30) అనే వ్యక్తి మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్‌లో బౌన్సర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం వేకువజామున విధుల ముగించుకొని మరో బౌన్సర్ రాజుతో కలిసి తన ద్విచక్ర వాహనంపై సికింద్రాబాద్ వెళ్తున్నాడు.  పెద్దమ్మ గుడి కమాన్ సమీపంలో వెనుక నుంచి కారు బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తారక్ రామ్ ఘటనా స్థలంలో చనిపోగా రాజు తీవ్రంగా గాయపడ్డారు. రాజును వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారు నడుపుతున్న వ్యక్తి పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జూబ్లీహిల్స్ పోలీసులు స్థలానికి చేరుకొని హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారును సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News