Monday, December 23, 2024

కాంగ్రెస్ అనేది ఎండ్రకాయల పార్టీ.. అందులోకి ఎవడన్నా పోతాడా?: కొత్త ప్రభాకర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలువడంపై దుష్ప్రచారం జరుగుతుందని బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుదవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ అనేది ఎండ్రికాయల పార్టీ.. అందులోకి ఎవడన్నా పోతాడా? అని ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి తెలంగాణకా.. కాంగ్రెస్ పార్టీకా?.. నియోజకవర్గ సమస్యల మీద ముఖ్యమంత్రిని మార్యాదపూర్వకంగా కలిశామని చెప్పారు. నియోజకవర్గాల్లో మాకు ప్రోటోకాల్ ఇబ్బందులు ఉన్నాయని.. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు. రైతుబంధు గురించి అడిగితె కోమటిరెడ్డి చెప్పుతో కొట్టండని అన్నారని.. ఇది సంస్కారమా అని ప్రశ్నించారు. తాము బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని.. కెసిఆర్ నాయకత్వంలో పనిచేస్తామని కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News