Saturday, January 4, 2025

హెచ్‌ఎండిఎలో 100కోట్ల తిమింగలం

- Advertisement -
- Advertisement -

మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఎసిబి సోదాలు, రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు, రూ.40లక్షల నగదు, 2కిలోల బంగారం, 60 చేతి గడియారాలు, 14 ఫోన్లు, 10 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎసిబి వలకు మరో అవినీతి తిమింగలం చి క్కింది. ఆదాయానికి మించిన అస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై హెచ్‌ఎండిఎ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇళ్లు, కార్యాలయల్లో అవినీతి నిరోధక శాఖ సోదాలు చేసింది. బుధవారం ఉదయం 5గంటల నుంచి బృందాలుగా విడిపో యి ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన రియల్ ఎ స్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా)కి కా ర్యదర్శిగానూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో భాగంగా మాస బ్ ట్యాంక్‌లోని రెరా కార్యాలయం, అ మీర్‌పేటలోని హెచ్‌ఎండిఎ కార్యాల యం, మణికొండలోని నివాసం, బంధువులు ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ, ఏకకాలంలో 20 చోట్ల 14 బృందాలతో దా డులు నిర్వహించింది.

అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇష్టానుసారం అనుమతులు జారీ చేసి అక్రమంగా కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని ఇటీవల ఎసిబికి వచ్చిన సమాచారంతో అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా ఇప్పటివరకూ రూ.100 కోట్లకుపైగా స్థిర, చర ఆస్తులు గుర్తించారు. వాటిలో రూ.40 లక్షల నగదు, రెండు కిలోల బంగారు ఆభరణాలు, ఖరీదైన 60 చేతి గడియారాలు, ఆస్తిపత్రాలు, బ్యాంకు డి పాజిట్లు ఉన్నట్లు ధ్రువీకరించారు. అలా నే 14 ఫోన్లు, 10 ల్యాప్‌టాప్‌లు మొదలగు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ సైతం ఉన్నట్లు గుర్తించి, వాటిని స్వాధీనపరచుకున్నా రు. బాలకృష్ణకు సంబంధించిన బ్యాం కు లాకర్లు, ఇతర ఆస్తులపై ఎసిబి దర్యా ప్తు ముమ్మరం చేసింది. అందులో భా గంగానే గురువారం కూడా సోదాలు కొనసాగునున్నట్లు అధికారులు వెల్లడించారు.

బాలకృష్ణకు సంబంధించిన బ్యాంకు లాకర్లు, ఇతర ఆస్తులపై ఎసిబి దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రస్తుతం శివబాలకృష్ణ ఉంటున్న విల్లా విలువే యాభై కోట్ల పై బడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. బ్యాంక్ లాకర్ల వివరాలు తెలిస్తే మరిన్ని ఆస్తులు ఈ తనిఖీల్లో బయటపడే అవకాశముందని స్పష్టమవుతోంది. ఎసిబి దాడుల్లో ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు బయటపడటం ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత అవినీతికి పాల్పడ్డ అధికారులపై దాడులు పెరిగాయి. దీనికి తోడు ఎసిబి డైరెక్టర్‌గా సివి ఆనంద్ నియామకం కావడం కూడా ఈ శాఖ పని జోరందుకుంది. తాజా దాడులు ఇతర అవినీతికి పాల్పడ్డ అధికారుల్లో గుబులు రేపుతున్నాయి. రాజకీయ ఒత్తిడికి తలొగ్గి తీసుకున్న నిర్ణయాలు, అవినీతి వ్యవహారాలు ఇప్పుడు తమ తలకు చుట్టుకు న్నట్లు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News