Monday, December 23, 2024

ఓటు వేయకుంటే చనిపోతానని అభ్యర్థి చెప్పడం సరికాదు: గవర్నర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సాధారణ సౌరుడిని అసాధారణ శక్తిగా చేసేదే ఓటు హక్కు అని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. జెఎన్‌టియులో జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఓట్ పుస్తకాన్ని గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. యువతి అఖిలకు గుర్తింపు కార్డు అందించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల్లో మరిన్ని వసతులు కల్పించాలని, ఎన్నికల రోజు ఇచ్చే సెలవు ఓటు వేసేందుకు మాత్రమేనని, విహార యాత్రలకు వెళ్లేందుకు కాదన్నారు. ఓటు వేయడం మనందరి బాధ్యత, హక్కు అని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి అండగా ఉండడం తన బాధ్యత అని తమిళిసై స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లేందుకు వీసా కోసం లైన్‌లో ఉంటారని.. అలాగే ఓటు కోసం లైన్‌లో ఉండాలని సూచించారు. అభ్యర్థులను పూర్తిగా విశ్లేషించిన తరువాత ఓటు వేయాలని సలహా ఇచ్చారు. ఓటు వేయకుంటే చనిపోతానని ఓ అభ్యర్థి చెప్పడం సరైన పద్ధతి కాదని చురకలంటించారు. ఎన్నికలను ప్రభావితం చేసే అభ్యర్థుల వ్యాఖ్యలపై ఇసి చర్యలు తీసుకోవాలన్నారు.

వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. స్కిట్‌లో భాగంగా కొడిమ్యాల కెజిబివి విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. వికారాబాద్ జిల్లా కోటపల్లి విద్యార్థులకు ద్వితీయ బహుమతి అందజేశారు. భూపాలపల్లి, ఆసిఫాబాద్ కలెక్టర్ల, పలువురికి ప్రశంస పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర తమిళిసై, సిఇఒ వికాస్ రాజ్, తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News