Saturday, April 5, 2025

రాష్ట్ర ప్రగతే మా విజన్: శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రగతే మా విజన్ అని ఐటి శాఖ మంత్రి మంత్రి శ్రీదర్ బాబు తెలిపారు. హోటల్ ఐటిసి కాకతీయలో సిఐఐ తెలంగాణ ఇన్‌ఫ్రా రియల్ ఎస్టేట్ సదస్సును మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు ప్రసంగించారు. గత ప్రభుత్వం చేపట్టని ప్రగతి పనులను ముందుకుతీసుకెళ్తామని స్పష్టం చేశారు. మూడు దశాబ్ధాలుగా స్థిరాస్తి రంగం ఎంతో అభివృద్ధి చెందిందని కొనియాడారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు. దావోస్ పర్యటనలో మౌలిక వసతులపై కూడా చర్చించామని, సుస్థిరమైన విధానంలో స్థిరాస్తి రంగం అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. విధానపరమైన నిర్ణయాల్లో పారిశ్రామికవేత్తల సహకారం అవసరమని శ్రీధర్ బాబు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News