అమరావతి: ఇద్దరు చిన్నారులు పానీపూరీ తిన్న తరువాత అస్వస్థతతకు గురై చనిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జంగారెడ్డి గూడెంలో బేలిపాటి రవి-చిన్న జమ్మక్క అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. రామచంద్రపురం ట్యాంకు వద్ద గుడారం వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ప్లాస్టిక్ సామాగ్రి అమ్ముతూ రవి కుటుంబాన్ని పోషిస్తున్నారు. రామకృష్ణ(10), విజయ్ (06) పానీ పూరీ కావాలని అడగడంతో ఏలూరు రోడ్డుపై ఉన్న బండి వద్ద పానీపూరీ తినిపించారు. తిన్నప్పటి నుంచి కడుపులో నొప్పిగా ఉందని ఇద్దరు పిల్లలు చెప్పారు. ఇంటికి వెళ్లిన తరువాత వాంతులు కావడంతో వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు పిల్లలను ఏలూరుకు తరలిస్తుండగా మృతి చెందారు. పానీపూరీ తిని తమ పిల్లలు మరణించారని వారి తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. మూడు సంవత్సరాల క్రితం ఒకరు అనారోగ్యంతో మృతి చెందారు.
పసిపిల్లల ప్రాణం తీసిన పానీపూరీ?
- Advertisement -
- Advertisement -
- Advertisement -