Sunday, January 19, 2025

ఫీల్గుడ్ లవ్ స్టోరీగా ‘అలనాటి రామచంద్రుడు’.. టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

కృష్ణ వంశీ, మోక్ష హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా అలనాటి రామచంద్రుడు. నూతన దర్శకుడు చిలుకూరి ఆకాష్ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా మేకర్స్.. స్టార్ ప్రడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా టీజర్ సినీ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఇందులో బ్రహ్మాజీ, సీనియర్ నటి సుధ, ప్రమోదిన, చైతన్య గరికిపాటి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శశాంక్ తిరుపతి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News