Saturday, November 23, 2024

రెండో రోజు ముగిసిన ఆట.. టీమిండియా 421/7

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసేసమయానికి తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 7వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసింది. రెండో రోజు 119/1తో ఆట ప్రారంభించిన భారత్ కు కొద్దిసేపటికే షాక్ తగిలింది. అర్థశతకం చేసి జోరు మీదున్న యశస్వి జైస్వాల్(80), శుభ్ మన్ గిల్(23)లు పెవిలియన్ చేరారు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెఎల్ రాహుల్(86) అర్థశతకంతో రాణించగా.. శ్రేయస్ అయ్యర్(35), భరత్(41)లు భారీ స్కోర్లను చేయలేకపోయారు. వీరు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా(81 నాటౌట్) కూడా భారీ అర్థశతకంతో మెరిశాడు. అక్షర్ పటేల్(35 నాటౌట్)తో కలిసి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. దీంతో భారత్, ఇంగ్లండ్ పై 175 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.

ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ హర్ట్ లీ, జో రూట్ లు చెరో రెండు వికెట్లు తీయగా..జాక్ లీచ్, రెహన్ అహ్మద్ లు తలో వికెట్ తీశారు. ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News