Saturday, November 23, 2024

శనివారం ఉదయం 11 కల్లా తేల్చండి

- Advertisement -
- Advertisement -

ముంబయి : మరాఠా కోటా నిరసన నేత మనోజ్ జరాంగే తమ డిమాండ్ ఆమోదం కోసం మహారాష్ట్ర ప్రభుత్వానికి శనివారం ఉదయం 11 గంటల గడువు విధించారు. ప్రభుత్వం వెంటనే ఒక ఆర్డినెన్స్ జారీ చేయాలని కూడా జరాంగే కోరారు. తమ డిమాండ్ నెరవేరని పక్షంలో భారీ నిరసన కోసం ముంబయి ఆజాద్ మైదాన్ వరకు పాదయాత్ర చేస్తామని జరాంగే హెచ్చరించారు. ‘శనివారం మధ్యాహ్నం 12 గంటలకు నేను నిర్ణయం తీసుకుంటాను. అయితే, ఆజాద్ మైదాన్‌కు నేను బయలుదేరిన పక్షంలో ఆ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోను’ అని జరాంగే స్పష్టం చేశారు. తమ సమాజానికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ మంజూరు అయ్యేంత వరకు నిరననకారులు మధ్యలో ఆందోళన విరమించబోరని ఆయన తెలిపారు.

అయితే, ఆ నిరసనకారుని డిమాండ్లను ఆమోదించినట్లు మహారాష్ట్ర విద్యా శాఖ మంత్రి దీపక్ కేసర్కర్ వెల్లడించారు. ప్రభుత్వ ప్రతినిధివర్గంతో సమావేశం అనంతరం నవీ ముంబయిలోని వాసీ ప్రాంతంలో శివాజీ చౌక్ వద్ద నిరసనకారులను ఉద్దేశించి జరాంగే ప్రసంగించారు. ఆ ప్రతినిధివర్గం కొన్ని డాక్యుమెంట్లను తనకు ఇచ్చిందని, తమ కార్యాచరణను ప్రకటించేందుకు వానిపై తన మద్దతుదారులతో చర్చిస్తానని జరాంగే తెలిపారు. ‘మేము రిజర్వేషన్ సాధించేంత వరకు ఉద్యమంపై వెనుకడుగు వేసేది లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా, ముంబయికి వెళ్లకుండా జరాంగేను ఒప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జరాంగే డిమాండ్లను ఆమోదించామని, ప్రభుత్వ నియమావళి ప్రకారం వాటిని అమటు చేయగలమని మంత్రి కేసర్కర్ విలేకరులతో చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News