తాను నటించిన ‘లాల్ సలామ్’ ఆడియో ఆవిష్కరణ సభలో రజనీకాంత్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలోని సాయిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఆడియో లాంచ్ కార్యక్రమం జరిగింది. ఫిబ్రవరి 9న రిలీజ్ కానున్న లాల్ సలామ్ మూవీలో విష్ణువిశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక కీలకమైన గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుబాస్కరన్ దర్శకత్వం చేశారు.
ఆడియో లాంచ్ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ ‘జైలర్ ఈవెంట్ లో భాగంగా నేను మాట్లాడుతూ ‘అర్థమైందా రాజా?’ అంటూ చేసిన వ్యాఖ్యలను దళపతి విజయ్ ను ఉద్దేశించే అన్నానంటూ కొందరు వక్రీకరించారు. విజయ్ నాకు ఎప్పటినుంచో తెలుసు. నా కళ్లముందే పెరిగిన వ్యక్తి విజయ్. అతనిపై నేనెందుకు కామెంట్ చేస్తాను. నాకు ఎవరితోనూ పోటీ ఉండదు. నాకు నేనే పోటీ. దయచేసి మా ఇద్దరినీ పోల్చి చూడకండి’ అని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
జైలర్ ఈవెంట్ లో రజనీ మాట్లాడుతూ ‘మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు. ఇవి రెండూ జరగని ఊరే లేదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి, అర్థమైందా రాజా?’ అన్నారు. అయితే దళపతి విజయ్ ను ఉద్దేశించే రజనీ ఈ వ్యాఖ్యలు చేశారంటూ నెట్ లో కొందరు వైరల్ చేశారు.
Clarification from Superstar Rajinikanth at the #LalSalaamAudioLaunch about the KAAKA KAZHUGU speech. pic.twitter.com/8NzNC7Psz0
— Actor Vijay Universe (@ActorVijayUniv) January 26, 2024