Friday, January 17, 2025

టిడిపి-జనసేన-బీజేపీ కూటమి తరఫున పోటీ చేస్తా

- Advertisement -
- Advertisement -

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను తెలుగుదేశం-జనసేన-బిజేపీ కూటమి తరఫున పోటీ చేస్తానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ఆయన శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు తనపై పోటీ చేసే అభ్యర్థి కోసం వెతుక్కోవాలని సలహా ఇచ్చారు. అభ్యర్థి దొరక్కపోతే, స్వయంగా జగనే తనపై పోటీ చేయాలని ఆయన సవాల్ చేశారు.

వైసీపీ సోషల్ మీడియాలో ఎంత చెత్త ప్రచారం చేసినా లాభం ఉండదన్నారు. షర్మిల వైఎస్సార్ కూతురు కాదనే విధంగా వైసీపీ నేతలు ప్రచారం చేయించడం, బూతులు తిట్టించడం దారుణమని రఘురామకృష్ణం రాజు అన్నారు. తనకు జరిగిన నష్టాన్ని, తనపట్ల జగన్ వ్యవహరించిన తీరును షర్మిల చెప్పారని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News