ఎప్‌సెట్ కన్వీనర్‌గా బి.డీన్ కుమార్
పిజిసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ అరుణ కుమారి
ఎడ్‌సెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ మృణాళిని
పిఈసెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ రాజేష్ నియామకయ్యారు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇటీవల ప్రకటించింది. శనివారం ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లు నియమిస్తూ ఉన్నత విద్యామండలి సెక్రటరీ శ్రీనివాస్‌రావు ప్రకటన విడుదల చేశారు. ఎప్‌సెట్ కన్వీనర్‌గా జెఎన్‌టియూ ప్రొఫెసర్ డి. డీన్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించింది. పిజి ఈసెట్ కన్వీనర్‌గా జెఎన్‌టియూ ప్రొఫెసర్ అరుణ కుమారి, ఐసెట్ కన్వీనర్‌గా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్ నర్సింహాచారి నియమించింది. ఈసెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, లాసెట్, పిజి ఎల్‌సెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ విజయలక్ష్మి, ఎడ్‌సెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ మృణాళిని, పిఈసెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ రాజేశ్‌కుమార్ నియామకమయ్యారు.
ఉమ్మడి ప్రవేశ పరీక్షలు మేలో ప్రారంభం కానున్నాయి. మే 9 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ కోర్సులకు ప్రవేశ పరీక్ష జరుగనున్నది. మే 12, 13 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మాసీ ప్రవేశ పరీక్ష జెఎన్‌టియూ ఆధ్వర్యంలో జరుగనున్నది. ఈసెట్ ప్రవేశ పరీక్ష ఉస్మానియా యూనివర్శి టీ ఆధ్వర్యంలో జరుగనుండగా మే 6వ తేదీర పరీక్ష నిర్వహిస్తారు. బిఈడీ కోర్సులో ప్రవేశం కోసం ఉద్దేశించిన టీఎస్ ఎడ్ సెట్ పరీక్ష మే 23న జరుగనుండగా నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరుగుతుంది. టిఎస్ లా సెట్ ఎంట్రన్స్ టెస్ట్ జరుగనున్నది. జూన్ 3న ఎల్‌ఎల్‌ఎం ప్రవేవ పరీక్ష జరుగనుండగా లాసెట్, పీజీ ఎల్‌సెట్‌లను ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహిస్తుంది. ఐసెట్ ప్రవేశ పరీక్ష జూన్ 4, 5 తేదీల్లో జరుగనుండగా కాకతీయ యూనివర్సిటీ నిర్వహణలో జరుగుతుంది. ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఉద్దేశించిన పీజీఈసెట్ పరీక్ష జూన్ 6 నుంచి 8 తేదీల మధ్యలలో నిర్వహించనున్నారు. జెఎన్‌టియూ ఆధ్వర్యంలో ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్టులు జరగనున్నాయి. బిపిఎడ్, డిపిఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పిఈసెట్ పరీక్ష జూన్ 10 నుంచి 13వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షను శాతవాహన యూనివర్శిటీ నిర్వహిస్తుంది.