- Advertisement -
మన తెలంగాణ / హైదరాబాద్: తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయని టిటిడి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 9న శ్రీ పురందరదాసుల ఆరాధనోత్సవం, 10న తిరుకచ్చి నంబి ఉత్సవారంభం,14న వసంత పంచమి,16న రథ సప్తమి,19న తిరుకచ్చి నంబి శాత్తుమొర, 20న భీష్మ ఏకాదశి, 21న శ్రీ కులశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం, 24న కుమారధార తీర్థముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడసేవ నిర్వహించనున్నట్లు తెలిపారు.
- Advertisement -