- Advertisement -
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రాంతం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బౌరమ్ పేట్ రహదారిపై అతి వేగంతో కారు నడిపి కరెంట్ పోల్ ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సాయినాథ్ గా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో కారు నడపడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
- Advertisement -