Friday, December 20, 2024

రాముని పాలనే రాజ్యాంగ నిర్మాతలకు ప్రేరణ

- Advertisement -
- Advertisement -

రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ ఎనలేనిది
కోట్లాది మందిని సంఘటితం చేసింది
రిపబ్లిక్ పరేడ్‌లో నారీ శక్తి ద్యోతకమైంది
మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : అయోధ్యలోని రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోట్లాది మందిని సంఘటితం చేసిందని, దేశ సమైక్య బలం ఆ ఉత్సవం సమయంలో ద్యోతకమైందని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం చెప్పారు. ఈ ఏడాది తొలి మన్ కీ బాత్‌లో మోడీ తన అభిప్రాయాలు వెలిబుచ్చుతూ, శ్రీరాముని పాలన రాజ్యాంగ నిర్మాతలకు స్ఫూర్తిదాయకం అయిందని తెలిపారు. ‘అందుకే అయోధ్యలో క్రితం సోమవారం (22న) ‘దేశానికి దేవుడు’, ‘జాతికి రాముడు’ అని మాట్లాడాను’ అని ఆయన చెప్పారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవం కోట్లాది మంది ప్రజలను సంఘటితం చేసిందని ప్రధాని చెప్పారు. ‘ప్రతి ఒక్కరి భావన అదే. ప్రతి ఒక్కరి భక్తి అదే. రాముడు ప్రతి ఒక్కరి మాటల్లో ఉన్నారు.

రాముడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నారు’ అని మోడీ తెలిపారు. ఆ సమయంలో పలువురు రాముని భజనలు ఆలాపించారని, వాటిని శ్రీరామునికి అంకితం చేశారని, 22 రాత్రి సమస్త దేశం ‘రామ్ జ్యోతి’ వెలిగించి, దీపావళి జరుపుకుందని మోడీ చెప్పారు. ‘ఆ సమయంలో దేశం మొత్తం బలం కానవచ్చింది. అది అభివృద్ధి భారతానికి మన ప్రతినకు ఆధారం అవుతోంది’ అని ప్రధాని చెప్పారు. సంఘటిత శక్తి దేశాన్ని ప్రగతి ఉన్నత శిఖరాలకు తీసుకువెళుతుందని ఆయన సూచించారు. మోడీ తన ప్రసంగంలో పద్మ పురస్కారాల గురించి కూడా ప్రస్తావించారు.

ఇటీవల పురస్కారాలు ప్రకటితమైన అనేక మంది అట్టడుగు స్థాయిలో పాటుపడిన, భారీ మార్పులు తీసుకురావడానికి వెలుగులోకి వచ్చినవారేనని ఆయన పేర్కొన్నారు. ‘పద్మ పురస్కారాల విధానం గడచిన దశాబ్దంలో పూర్తిగా పరివర్తన చెందినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇప్పుడు అది ప్రజల పద్మ పురస్కారం అయింది’ అని ప్రధాని మోడీ చెప్పారు. పద్మ పురస్కారాల విజేతలలో ప్రతి ఒక్కరి కృషి దేశ ప్రజలకు ప్రేరణ అని ఆయన చెప్పారు. వారిలో చాలా మంది శాస్త్రీయ నృత్యం, శాస్త్రీయ సంగీతం, జానపద నృత్యం, రంగస్థలం, భజనలలో దేశానికి ఖ్యాతి తెచ్చినవారేనని ఆయన పేర్కొన్నారు.

కాగా, రిపబ్లిక్ పరేడ్‌లో నారీ శక్తి ఉనికిని ప్రధాని శ్లాఘిస్తూ, ఇరవై బృందాలలో పదకొండు పూర్తిగా మహిళలతో కూడుకున్నవేనని ఆయన చెప్పారు. ‘పరేడ్‌లో సాగిన శకటాలలో సైతం కళాకారులు అందరూ మహిళలే. దాదాపు 1500 మంది తనయలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని మోడీ తెలియజేశారు. 21వ శతాబ్దపు భారతదేశం మహిళల నేతృత్వంలో అభివృద్ధి మ ంత్రంతో ముందుకు సాగుతోందని మోడీ చెప్పారు. ఈ పర్యాయం 13 మంది మహిళా అథ్లెట్లను అర్జున పురస్కారంతో సత్యరించినట్లు మోడీ తెలిపారు.అవయవ దాతలను ప్రధాని మోడీ కొనియాడుతూ, కొందరు సామాజిక సేవ ద్వారా, కొందరు ఆరీమలో చేరడం ద్వారా మరి కొందరు తదుపరి తరానికి బోధించడం ద్వారా తమ విధులు నిర్వర్తిస్తుంటారని, తమ జీవితం అనంతరమూ సమాజం పట్ల తమ బాధ్యతలు నెరవేర్చేవారు ఇంకొందరు ఉన్నారని మోడీ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News