Sunday, December 22, 2024

ఒకేసారి మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చిన ఇరాన్

- Advertisement -
- Advertisement -

టెహ్రాన్: ఇరాన్ ఆదివారం ఏకకాలంలో ముడు ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది. స్వదేశీయంగా రూపొందించిన సిమోర్గ్ రాకెట్ వాటిని 450 కిమీ ఎత్తున ఉన్న కక్ష్యలోకి చేర్చగలిగింది. ఈ మూడు ఉపగ్రహాల్లో 35 కిలోల బరువున్న ఉపగ్రహం ఒకటి కాగా, మిగిలిన రెండూ 10 కిలోల బరువున్న నానో శాటిలైట్లు. వీటితో జియో పొజిషనింగ్ టెక్నాలజీ , కమ్యూనికేషన్లను పరీక్షించనున్నారు.

వీటిలో పెద్ద ఉపగ్రహాన్ని మహ్దగా మిగిలిన వాటిని కహ్యాన్ 2, హతెఫ్1 అని వ్యవహరిస్తున్నారు. ఇరాన్ స్పేస్ ఏజెన్సీ వీటిని రూపొందించింది. వివిధ రకాల పేలోడ్‌లను అంతరిక్షం లోకి చేర్చడంలో సిమోర్గ్ రాకెట్ ఎంతవరకు కచ్చితత్వంగా ఉందో ఈ సందర్భంగా పరీక్షించారు. ఈనెల లోనే ఇరాన్ సొరయా అనే 50 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని 750 కిమీ ఎత్తునున్న కక్ష లోకి పంపింది. దీన్ని ఆదేశానికి చెందిన సైనిక విభాగం ఐఆర్‌జిసి తయారు చేసింది. రాత్రివేళ జరిగిన ఈ ప్రయోగ దృశ్యాలు ప్రభుత్వ టీవీ చానెల్స్‌లో ప్రసారం చేశారు. సెమ్నాన్ ప్రావిన్స్ లోని ఇమామ్ ఖొమైనీ స్పేస్ పోర్టులో దీన్ని నిర్వహించినట్టు ఓ ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News