Sunday, January 19, 2025

ప్రియుడు మోసం చేయడంతో యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రేమికుడు మోసం చేయడంతో భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ఫరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…అత్తాపూర్‌కు చెందిన అతిథి భరద్వాజ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. కుటుంబంతోపాటు హాఫీ హోం ఫార్చూన్ అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. తనతోపాటు పనిచేసే యువకుడిని ప్రేమించింది. ఇద్దరు చాలా కాలం నుంచి సన్నిహితంగా ఉంటున్నారు.

ఈ క్రమంలో ఇటీవల కాలంలో యువకుడు అతిథిని దూరం పెట్టి వేరే యువతితో తిరుగుతున్నాడు. దీంతో తాను మోసపోయానని మనస్థాపం చెందిన యువతి ఆదివారం ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News