Monday, January 20, 2025

జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి హత్య

- Advertisement -
- Advertisement -

జవహర్‌నగర్: జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసిన దుండగులు ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ ఘటన పోలీస్‌స్టేషన్ పరిధిలోని మదర్‌థెరిస్సా వికలాంగుల కాలనీ నుంచి కౌకూర్ వెళ్లే అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. దుండుగులు వ్యక్తిని హత్య చేసి అనంతరం ఈ నిర్మానుష ప్రాంతంలో తగులబెట్టినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన శనివారం ఆర్ధరాత్రి జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం ఉదయం స్థానికుల సమాచారం మేరకు జవహర్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు దాదాపు 30 నుంచి 35 మధ్య ఉండి ఎత్తు 5.2 ఉన్నట్లు గుర్తించారు.

బ్లూకలర్ షీట్‌లో తీసుకొచ్చి కాల్చివేసినట్లు పోలీసులు తెలిపారు. కుషాయిగూడ ఎసిపి రవీందర్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.సీతారాం ఇతర పోలీస్ అధికారులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దుండగులు గుర్తు తెలియని వ్యక్తిని ఇతర ప్రాంతంలో మర్డర్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి కాల్చివేసినట్లుగా ప్రాథమిక ధర్యాప్తులో గుర్తించినట్లు తెలిపారు. క్లూస్ టీం,డాగ్ స్కాడ్‌ను రప్పించి పరిసరాలను పరిశీలించామని, ఇతర ప్రాంతాల్లో మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నట్లు ఎసిపి తెలిపారు. జవహర్‌నగర్ పరిసర ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నామని, నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News