Saturday, December 21, 2024

పదేళ్ల ప్రేమాయణం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని చంపిన ప్రియుడు

- Advertisement -
- Advertisement -

ముంబయి: ప్రియుడి చేతిలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్యకు గురైన సంఘటన మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రిషబ్ నిగమ్, వందనలు గత పది సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. వందన పుణేలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తుంది. రిషబ్ ప్రవర్తన నచ్చకపోవడంతో అతడికి కొంతకాలం నుంచి ప్రియురాలు దూరంగా ఉంటుంది. దీంతో అతడు మనస్థాపానికి గురయ్యాడు. రోజు రోజుకు ప్రియురాలు ప్రియుడితో మాట్లాడకపోవడంతో ఆమెపై అతడు పగ పెంచుకొని హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. పుణెకు వచ్చానని కలువాలని ప్రియురాలుకు ప్రియుడు ఫోన్ చేశాడు. పుణేలోని ఓయో హోటల్‌లో రూమ్ బుక్ చేసి ఆమెకు కబురు పంపాడు. ఆమె హోటల్ రూమ్‌కు చేరుకున్న తరువాత ఇద్దరు మధ్య గొడవ జరిగింది. వెంటనే తుపాకీ తీసి ఆమెపై కాల్పులు జరిపాడు. వెంటనే అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. హోటల్ రూమ్‌లో యువతి మృతదేహం కనిపించడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హోటల్‌లో సిసి కెమెరాల ఆధారంగా అతడిని గుర్తించారు. ఫోన్ ఆధారంగా అతడు ఎక్కడ ఉన్నాడో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రిషబ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News