Monday, December 23, 2024

బిగ్ బాస్ విజేత మునావర్ ఫారూఖీ

- Advertisement -
- Advertisement -

కండల వీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 17లో మునావర్ ఫారూఖీ విజేతగా నిలిచాడు. ప్రముఖ స్టాండప్ కమెడియన్ అయిన ఫారూఖీకి నటుడు అభిషేక్ కుమార్ గట్టి పోటీ ఇచ్చాడు. అయితే మొదటినుంచీ చక్కటి ప్రతిభ కనబరుస్తూ వచ్చిన ఫారూఖీనే విజయం వరించింది. ఈ షోలో పాల్గొన్న అంకితా లోఖండే-విక్కీ జైన్ జంట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. విజేతగా నిలిచిన ఫారూఖీకి ఒక కారు. 50 లక్షల రూపాయల నగదు బహుమతులుగా లభించాయి.

బిగ్ బాస్ సీజన్ 17లో 21మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. 107 రోజులపాటు సీజన్ కొనసాగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News