Friday, December 20, 2024

పిల్లలను వారి స్నేహితులతో పోల్చి ఇబ్బందిపెట్టొద్దు: మోడీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: పరీక్షల సమయంలో ఒత్తిడి లేకుండా విద్యార్థులు చూసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం జరిగింది. ఢిల్లీలోని భారత మండపంలో విద్యార్థులతో ప్రధాని మాటామంత్రి నిర్వహించారు. ఏడేళ్లుగా పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు కూడా ఒత్తిడి పెంచకూడదని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చూడాలన్నారు. రోజుకు 15 గంటలు చదవాలని ఒత్తిడి చేయడం మంచిది కాదని మోడీ సూచించారు. పరీక్షల ఒత్తిడి అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ సొంత పద్ధతులు పాటించాలని, చదివే సమయాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలని సలహాలు ఇచ్చారు. పిల్లలను వారి స్నేహితులతో పోల్చి ఇబ్బందిపెట్టడం సరికాదని చెప్పారు. పక్కవారితో పోల్చడం వల్ల పిల్లల్లో అసూయ, ద్వేషాలు పెరుగుతాయని, పక్కవారితో పోల్చడం వలన మానసిక ఎదుగుదల సరిగా ఉండదని మోడీ తెలియజేశారు. పిల్లల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని, చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకొని ముందుకు వెళ్లాలని, తల్లిదండ్రుల ఆకాంక్షాలను లక్ష్యాలను పిల్లలపై రుద్దడం సరికాదన్నారు. మన పిల్లల్లో అద్భుతమైన శక్తి సామర్థాలు ఉన్నాయని ఆయన వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News