Friday, December 20, 2024

బాబాయ్‌ను చంపి… రోడ్లపై తిరుగుతున్న అవినాష్ రెడ్డి: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: బాబాయ్‌ను చంపిన ఎంపి అవినాష్ రెడ్డి మాత్రం రోడ్డుపై తిరుగుతున్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. కోడికత్తి శ్రీను ఐదేళ్ల నుంచి జైలులో మగ్గుతున్నారని, సామాజిక న్యాయమంటే ఇదేనా సిఎం జగన్ చెప్పాలని నిలదీశారు. ఇసుక దోపిడీ ప్రశ్నించిన వరప్రసాద్‌కు గుండు గీయించారని, ఊరికొక దళితుడిని బలి చేశారని, చెప్పేదంతా నీతులు సిఎం జగన్ మోహన్ రెడ్డి చేసేవన్నీ సైకో పనులు ధజమెత్తారు. దళితులెవరూ నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదని, దళిత స్వరం వినిపిస్తే గొంతు నొక్కేస్తారని, చంపేస్తారని, నాలుగున్నరేళ్లలో ఆరు వేల దాడులు చేసి 188 మంది పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్‌ను పిచ్చోణి చేసి చంపారని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News