Thursday, December 19, 2024

పేలిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ.. బయపడిన ఖాతాదారులు

- Advertisement -
- Advertisement -

నేటి ఆధునిక యుగంలో పెట్రోల్ వాహనాలు తగ్గిపోయి కరెంట్ తో నడిచే వాహనాలు వచ్చేశాయి. వాహనదారులు వాటిని కోనుగోలు చేసి చార్జింగ్ పెట్టి నడిపిస్తున్నారు. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్లు తరుచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా జోగిపేట ఎస్ బిఐ బ్యాంకు వద్ద సోమవారం ఎలక్ట్రిక్ బైక్ నుంచి పొగలు వచ్చాయి. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. పొగలు చూసిన ఎస్ బిఐ సిబ్బంది, ఖాతాదారులు భయాందోళనకు గురయ్యారు. బ్యాటరీ పేలిపోతుందేమో అన్న భయంతో పరుగులు పెట్టారు. కొందరు స్థానికులు ధైర్యం చేసి స్యూటీలోని బ్యాటరీ తొలగించిన కాలువలో పడేశారు. ఈ ప్రమాదం జరగక పోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News