Monday, December 23, 2024

ఎంఎల్ఎ కారుకు జరిమానా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్ ఉన్న ఓ ఎమ్మెల్యే కారుకు మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. మాదాపూర్ ట్రాఫిక్ ఎసిపి రణవీర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై అర్జున్ వాహనాలను తనిఖీ చేస్తున్నాడు. ఈ సమయంలో అటువైపు వచ్చిన కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉంది, వెంటనే ఆపిన ట్రాఫిక్ పోలీసులు వాటిని తొలగించి జరిమానా విధించారు. ఈ కారు ఓ ఎమ్మెల్యేకు చెందినదిగా తెలిసింది. ఎసిపి రణవీర్‌రెడ్డి మాట్లాడుతూ వాహనదారులు బ్లాక్‌ఫిల్మ్ వేయవద్దని,ఇది నిబంధనలకు విరుద్ధమని అన్నారు. ఉన్నవాటిని తొలగించి జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News