Sunday, January 19, 2025

2023 లో భారతీయులకు 14 లక్షల అమెరికా వీసాలు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ /న్యూఢిల్లీ : గడిచిన 2023 సంవత్సరంలో అమెరికా రికార్డు స్థాయిలో 14 లక్షల మంది భారతీయులకు వీసాలు జారీ చేసింది. దీనితో విజిటర్స్ వీసాల అపాయింట్మెంట్ సమయం దాదాపు 75 శాతం తగ్గిందని ఢిల్లీలోని అమెరికా ఎంబసీ సోమవారం తెలిపింది. అమెరికాలో పర్యటనకు వెళ్లే విజిటర్స్ వీసాలు 2022లో జారీ చేసిన వాటితో పోలిస్తే ఇప్పుడు జారీ అయిన వీసాల సంఖ్య 60 శాతం ఎక్కువ అని కూడా అమెరికా అధికారవర్గాలు తెలిపాయి. ఇంతకు ముందు విజిటర్స్ వీసాకు కనీసం 1000 రోజుల స్థాయిలో ఎదురుచూడాల్సి ఉండేది. ఇప్పుడు దీనిని సిబ్బందిని పెంచడం ఇతరత్రా చర్యలతో సగటున కేవలం 250 రోజులకు తగ్గించగల్గినట్లు గణాంకాల వివరాలతో తెలిపారు. అన్ని కేటగిరిల వీసాలకు సంబంధించి వెయిటింగ్ దశ కనీస స్థాయిలో ఉండేలా చూస్తున్నామని పేర్కొన్నారు. భారతదేశం నుంచి అన్ని రకాల వీసాల కేటగిరిలపై అసాధారణ రీతిలో డిమాండ్ ఉందని , దీనిని దృష్టిలో పెట్టుకుని పలు విధాలుగా పూర్తిస్థాయి సిబ్బంది

, తగు వనరులను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేసినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు.ఈ నేపథ్యంలో 2022 , ఇప్పుడు 2023లో అమెరికా నుంచి భారతీయులకు మంజూరు అయిన వీసాల గణాంకాలను తెలియచేశారు. యుఎస్ వీసాల అధికారిక చరిత్రలో బి1/బిఎ2 తరహా విజిటర్స్ వీసాల దరఖాస్తులు ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా 7,00,000 దాటాయని వివరించారు. పరిస్థితిని గమనించి తమ ఎంబసీ, కాన్సులెట్లు తీసుకున్న పలు చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని అధికారిక ప్రకటనలో తెలిపారు. ఇక గడిచిన ఏడాది ఏ దేశానికి లేని విధంగా అమెరికా కాన్సులర్ బృందం భారత్‌కు 1,40,000కు పైగా వీసాలు జారీ చేసింది. వరుసగా ఈ పరిణామం ఇది మూడో రికార్డు అయింది. స్టూడెంట్స్ వీసాల జారీలో వరుసగా ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, చెన్నైలకు ఎక్కువగా విద్యార్థి వీసాలు దక్కాయి. అత్యధిక సంఖ్యలో స్టూడెంట్స్ వీసాల జారీతో ఇప్పుడు అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్యనే ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉంది. దాదాపు పదిలక్షలకు పైగా విదేశీ విద్యార్థులు ఉన్న అమెరికాలో ఇప్పుడు భారతీయ విద్యార్థుల సంఖ్య ఇప్పుడు ఇందులో పావువంతు వరకూ ఉందని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News