Saturday, December 21, 2024

టీమిండియాలో సర్ఫరాజ్‌కు చోటు

- Advertisement -
- Advertisement -

ముంబై: ఇంగ్లండ్‌తో విశాఖపట్నం వేదికగా జరిగే రెండో టెస్టులో యువ ఆటగాడు, దేశవాళీ స్టార్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు బిసిసిఐ నుంచి పిలుపువచ్చింది. తొలి టెస్టులో గాయపడిన కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు విశాఖ మ్యాచ్‌కు దూరమయ్యారు. వీరి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్‌లను జట్టులోకి తీసుకున్నారు. కాగా, దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నా సర్ఫరాజ్‌కు టీమిండియాలో చోటు దక్కలేదు. ఎట్టకేలకు అతని నిరీక్షణకు తెరపడింది. టీమిండియాలో అతనికి చోటు దక్కింది. అందివచ్చిన అవకాశాన్ని అతను ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News