కొత్త నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల్లో భారీ ప్రక్షాళన కార్యక్రం చేపట్టింది. ఇప్పటికే విద్యు త్ సంస్థల్లో ఏళ్ళ తరబడి కొనసాగుతున్న డైరక్టర్లకు ఉద్వాసన పలుకుతూ ఇంటికి సాగనంపింది. వీరి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యుత్‌శాఖను ప్రక్షాళన చేస కార్యక్రమంలో భాగంగా ఎన్నో సంవత్సరాల నుంచి పాతుకు పోయిన 22 మంది డైరక్టన్లు తొలిగిస్తూనే మరో వైపు 11 మంది డైరక్టర్లను నియమించుకునేందుకు డైరక్టర్ హైడల్, ధర్మల్, హెచ్‌ఆర్, కోల్ లాజిస్టి క్ ,ఫైనాన్స్, కమర్షియల్ ఆయా రంగాల్లో నిపుణులైన ఇం జనీర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అదే సమయంలో టిఎస్‌ఎస్‌డిసిఎల్ (దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ)7, టిఎన్‌పిడిసిఎల్‌లో 4 మొత్తం 11 మంది డైరక్టర్లకు ఉద్వాసన పలుకుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
టిఎస్‌ఎస్‌పిడిసిఎల్‌లో గత పది సంత్సరాలకు పైగా ఆపరేషన్ డైరక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న టి. శ్రీనివాస్, తొమ్మిది సంవత్సరాలకు పైగా ఆపరేషన్ డైరక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న జె.శ్రీనివాసరెడ్డి, ఐదు సంవత్సరాలకు పైగా డైరక్టర్ ఉన్న సి.హెచ్ మదన్‌మోహన్‌రావు, హె చ్‌ఆర్ విభాగంలో ఐదు సంవత్సరాలకు పైగా డైరక్టర్‌లుగా విధులు నిర్వహిస్తున్న జి.పర్వతం, ఎస్. స్వామిరెడ్డి, కె. రాములు ( కమర్షియల్ )ను, రెండు సంవత్సరాలకు పైగా ఆడిట్ డైరక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గంప గోపాల్ , టిఎన్‌పిడిసిఎల్‌లో గత పది సంత్సరాలకు పైగా హెచ్‌ఆర్ డైరక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావు, ఐదు సం త్సరాలకు పైగా ప్రాజెక్ట్ డైరక్టర్‌గా విధలు నిర్వహిస్తున్న పి. మోహన్ రెడ్డి, ఐదు సంవత్సరాలుగా కమర్షియల్ డైరక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న పి. సంద్య, పి. గణపతిలను 11 మంది డైరక్టర్‌లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక వైపు వారని తొలగిస్తూనే ప్రభుత్వం జెన్‌కోలో కొత్త డైరక్టర్లను నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.