Friday, November 15, 2024

కోతల్లేకుండా విద్యుత్ సరఫరా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీకి సంబంధించిన కొద్ది మంది సోషల్ మీడియా వీ రులు కరెంటు సరఫరా పైన తప్పుడు ప్రచారం చే స్తూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగా ణ ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు తో పాటు ఎటువంటి కోతలు లేకుండా నిరంతరం విద్యుత్తు సరఫ రా జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం చీకట్లో ఉండాలని కలలు కంటున్న బిఆర్‌ఎస్ సోషల్ మీ డియా వీరుల ఆశలను, అసలు స్వరూపాన్నిప్రజ లు గమనిస్తున్నారన్నారు. తెలంగాణలో విద్యు త్ సరఫరా గత సంవత్సరంతో పోలిస్తే 2023 డిసెంబర్ 07 నుండి గణనీయంగా మెరుగుపడిందని వివరించారు.

2023 డిసెంబర్ నెలలో రాష్ట్రంలో ప్ర తి రోజు సగటున 207.7 మిలియన్ యూనిట్ల వి ద్యుత్ సరఫరా చేశామని, 2022 డిసెంబర్ లో సగటున 200 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫ రా చేశారని చెప్పారు. 2024 జనవరి 1 నుండి 28 వరకు, రాష్ట్రంలో సగటున 242.43 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశామన్నారు. గతేడా ది ఇదే కాలంలో సగటున 226 మిలియన్ యూ నిట్లు మాత్రమే సరఫరా అయ్యిందన్నారు. వచ్చె నెల ఫిబ్రవరి నుండి ఏప్రిల్ 2024 వరకు విద్యుత్తు డిమాండ్ను తీర్చడానికి తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ రాష్టాలతో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం 1200 మెగావాట్ల విద్యుత్తును ముందస్తుగా రిజ ర్వు చేసుకున్నామని చెప్పారు. విద్యుత్ సరఫరా విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలు, వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2023 జనవరి కంటే 2024 జనవరిలో ఎక్కువగా విద్యుత్తు సరఫరా జరిగిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News