Monday, January 20, 2025

అసహజ శృంగారం చేయమన్నందుకు చంపేశాడు….

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: అసహజ శృంగారానికి యువకుడు బలవంతం చేయడంతో అతడిని మరో వ్యక్తి హత్య చేసిన సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మోరీ గేట్ వద్ద డిడిఎ పార్క్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం గాయాలు ఉండడంతో ప్రాథమికంగా హత్య చేసినట్టు గుర్తించారు. మోరీ గేట్ సమీపంలో ఉన్న సిసి కెమెరాలను పరిశీలించగా అతడితో పాటు మరో వ్యక్తి ఉన్నట్టు గుర్తించారు. మృతుడు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం జలాన్‌కు చెంది ప్రమోద్ కుమార్ శుక్లాగా గుర్తించారు. కోయా మండిలోని ఓ దుకాణంలో ప్రమోద్ పని చేసేవాడు. సిసి టివి ఫుటేజ్‌లో శుక్లాతో పాటు రాజేశ్ కనిపించడంతో అతడిని బిహార్‌లోని పాట్నాలో అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ప్రమోద్ తనని అసహజ శృంగారంలో పాల్గొన్నాలని పలుమార్లు ఒత్తిడి చేశాడు. దీంతో ప్లాన్ వేసుకొని శుక్లాను చంపేశానని నిజాలు రాజేశ్ ఒప్పుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News