Sunday, November 24, 2024

బడిలో విద్యార్థులకు ఉపాధ్యాయులే తల్లిదండ్రులు: మాజీ మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /సిటీ బ్యూరో: బడిలో విద్యార్ధులకు ఉపాద్యాయులే తల్లిదండ్రులు అని, వారంతా చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల సైతం ఆసక్తి చూపేలా ప్రోత్సహించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. మంగళవారం సనత్ నగర్ లోని స్పోర్ట్ గ్రౌండ్ లో రికగ్నైజ్ద్ స్కూల్స్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్షిక స్పోర్ట్ మీట్‌కు ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ముందుగా విద్యార్ధులు మార్చ్ పాస్ట్ ను నిర్వహించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఉపాద్యాయులు మంచి విద్యాబుద్దులు చెప్పి విద్యార్ధులను మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్ది వారికి బంగారు భవిష్యత్ ను అందించే గురుతర బాధ్యత నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. సమాజంలో తల్లిదండ్రుల తర్వాతి స్థానం ఉపాద్యాయులదేననే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. విద్యార్ధులు స్కూల్ నుండి ఇంటికి రాగానే సెల్ ఫోన్ లలో నిమగ్నం అవుతారని, సెల్ ఫోన్ లకు దూరంగా ఉండాలని చెప్పారు. తమ ఖాళీ సమయాన్ని వృధా చేసుకోకుండా క్రీడలు, సాంస్కృతిక రంగాల పట్ల దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.

క్రీడలలో పాల్గొనడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడమే కాకుండా ఎంతో ప్రశాంతంగా ఉండోచ్చాని చెప్పారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఏ ఏ రంగాలలో ఆసక్తి ఉన్నదో గుర్తించి ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున పోటీలను నిర్వహిస్తున్న ఆర్‌ఎస్‌ఎంఎ అసోసియేషన్ ప్రతినిధులను ఆయన అభినందించారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ పోటీలలో సుమారు 1500 మంది విద్యార్ధినీ, విద్యార్ధులు పాల్గొంటున్నట్లు నిర్వహకులు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలను లక్ష్మి, బిఆర్‌ఎస్ పార్టీ సనత్ నగర్ డివిజన్ అద్యక్షుడు కొలను బాల్ రెడ్డి, ఆర్‌ఎస్‌ఎంఎ అద్యక్షులు అగస్టీన్, కార్యదర్శి సుధాకర్, కుతుబుద్దీన్, వివి రావు, ఎంఎస్ ప్రసాద్, ప్రశాంత్, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News