- Advertisement -
పాట్నా : బీహార్ మాజీ డిప్యూటీ సిఎం , ఆర్‌జేడీ నేత తేజస్వియాదవ్ మంగళవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఉద్యోగాల కుంభకోణం కేసులో ఈడీ అధికారులు నోటీస్‌లు జారీ చేయడంతో ఆయన విచారణకు హాజరు కావలసి వచ్చింది. ఈ సందర్భంగా ఈడీ కార్యాలయం వద్దకు ఆర్జేడీ నేతలు భారీ సంఖ్యలో చేరుకున్నారు.
జనవరి 29న మాజీ సిఎం లాలూ ప్రసాద్ యుదవ్ హాజరు కావాలని ఈడీ ఆదేశించగా, మరుసటి రోజే జనవరి 30న తేజస్వి హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. భూములు తీసుకుని ఉద్యోగాలిచ్చారన్న ఆరోపణపై మనీ లాండరింగ్ కేసు కింద ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌కు , సన్నిహితుడైన అమిత్ కత్యాల్‌ను ఈడీ గతంలో అరెస్టు చేసింది.
- Advertisement -