Saturday, December 21, 2024

రెండు గంటల పాటు నరకయాతన

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ : కదులుతున్న రైలు ఎక్కబోయి.. కింద పడి ప్లాట్‌ఫాం మధ్యలో ఇరుక్కున్న ప్రయాణికుడు బయటికి రావడానికి రెండు గంటలపాటు నరకయాతన అనుభవించాడు. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన యశ్వంత్‌పూర్ రైలు బయలుదేతుండగా ఓ ప్రయాణికుడు పరిగెత్తుకుంటూ వచ్చి రైలు ఎక్కబోయాడు. ఈ క్రమంలో కాలుజారి రైలు కింద పడిపోయాడు. ట్రైను కదలడంతో కొద్దిదూరం ప్లాట్‌ఫాంకు, ట్రైన్‌కు మధ్య ఇరుక్కోవడంతో కొంతదూరం వరకు అలాగే యాతన అనుభవించాడు. దీనిని గమనించిన కొందరు ప్రయాణికులు స్టేషన్ రైల్వే రైలు ఇంజిన్ డ్రైవర్‌కు చెప్పి ట్రైన్‌ను ఆపారు.

అనంతరం అతనిని బయటికి లాగడానికి తీసే ప్రయత్నం చేశారు. అయితే ఎంతకీ బయటికి రాకపోవడంతో ప్లాట్‌ఫాంను పగులగొట్టి బయటకు తీశారు. గాయాలపాయాలైన వ్యక్తి రాయచూర్ కు చెందిన సతీష్‌గా పోలీసులు గుర్తించారు. అతనిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News