Monday, December 23, 2024

ఆస్పత్రిలో మృతదేహానికి చీమలు….

- Advertisement -
- Advertisement -

అమరావతి: పోస్టుమార్టమ్ గదిలో ఫ్రీజర్‌బాక్స్‌లో ఉన్న బాలిక మృతదేహానికి చీమలు పట్టడంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నా చేసిన సంఘటన వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం బాలిక తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం జమ్మలమడుగు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో శవపరీక్ష చేయాల్సింది వాయిదా పడడంతో ఫ్రీజర్ బాక్స్‌లో మృతదేహాన్ని ఉంచారు. మంగళవారం ఉదయం బంధువులు ఆస్పత్రికి చేరుకొని మృతదేహాన్ని చూడగా చీమల పట్టి ఉండడంతో సిబ్బంది అడిగారు. చీమల మందు తెచ్చుకోండి శుభ్ర చేస్తామని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. బంధువుల ఆస్పత్రి ఎదుట ఆందోళన చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాడు. ఫ్రీజర్ బాక్స్‌లో పెట్టేటప్పుడు చీమలు ఏమీ లేవని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News