క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఆస్పత్రి పాలుకావడం క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. టీమిండియా తరఫున అతను అనేక మ్యాచ్ లు ఆడాడు. ప్రస్తుతం కర్నాటక జట్టు కెప్టెన్ గా రంజీల్లో ఆడుతున్నాడు. మంగళవారం రాజ్ కోట్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు విమానం ఎక్కిన మయాంక్, తన సీటు ముందు ప్లాస్టిక్ కవర్లో ఉన్న ద్రావకాన్ని మంచినీళ్లనుకుని తాగి, తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే విమానాన్ని ఆపి అతన్ని ఆస్పత్రికి తరలించారు. ద్రావకం తాగిన వెంటనే మయాంక్ నోరు, పెదాలు వాచిపోయాయి. నోటి లోపల పుండ్లు పడ్డాయి. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. మయాంక్ అగర్తలలోని ఒక ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు మయాంక్ మేనేజర్ తెలిపారు.
జరిగిన సంఘటనపై మయాంక్ తరఫున అతని మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనపై దర్యాప్తు చేయవలసిందిగా ఆయన కోరారు.
టీమిండియా తరఫున మయాంక్ 21 టెస్టులు ఆడాడు. అయితే 2022లో అతను జట్టులో స్థానాన్ని కోల్పోయాడు.