- Advertisement -
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రశ్నించేందుకు ఢిల్లీ సీఎంకు బుధవారం మళ్లీ సమన్లు జారీ చేసింది. కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు ఇవ్వడం ఇది ఐదోసారి. ఇప్పటికే నాలుగుసార్లు నోటీసులు ఇచ్చినా.. ఆయన విచారణకు మాత్రం హాజరుకాలేదు.
ఈ క్రమంలో మరోసారి నోటీసులు ఇచ్చిన ఈడీ.. ఈ సారిమాత్రం రావాల్సిందేనని కేజ్రీవాల్‌కు తేల్చి చెప్పింది. ఫిబ్రవరి 2న విచారణ కోసం ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో తెలిపింది. మరి ఇప్పుడు కూడా కేజ్రీవాల్.. విచారణకు హాజరవుతారా? లేదో? చూడాలి.
- Advertisement -