Saturday, December 21, 2024

ప్రతి నిరుద్యోగి కల సాకారం చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

టిఎస్‌పిఎస్‌సి ద్వారా త్వరలోనే ఉద్యోగాల భర్తీని చేపడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. బుధవారం ఎల్బీ స్టేడియంలో కొత్తగా ఎంపికైన స్టాఫ్ నర్సులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమం నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..  నిరుద్యోగుల కల సాకారం చేయడంలో ముందడుగు పడిందన్నారు. గత ప్రభుత్వంలో టిఎస్‌పిఎస్‌సి బోర్డు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టిఎస్‌పిఎస్‌సి ను ప్రక్షాళన చేసి.. నూతన చైర్మన్ ను నియమించామని తెలిపారు. త్వరలోనే 15వేల పోలీస్ ఉద్యోగాలను చేపడుతామని చెప్పారు. అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలను నింపుతామని… సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాల భర్తి చేసే భాద్యత తనదన్నారు.

తెలంగాణ పునర్ నిర్మాణం కోసం కష్టపడుతామని సీఎం అన్నారు. ఉద్యోగాలు ఇస్తుంటే.. బిఆర్ఎస్ నేతల కడుపు మండుతుందని విమర్శించారు. ప్రతి నిరుద్యోగి కల సాకారం చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచించలేదన్నారు. ఉద్యోగాల కోసం ఉద్యమం బాట పట్టి.. నిరుద్యోగులు, విద్యార్తులు ముందు భాగాన నిలబడ్డారని.. విద్యార్థుల త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని… పైగా వారిపై కేసులు పెట్టి వేధించిందని సీఎం రేవంత్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News