Monday, December 23, 2024

అమెరికాలో హెల్త్ కేర్ స్కామ్.. భారతీయుడికి జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికాలో హెల్త్ కేర్ కుంభకోణానికి పాల్పడిన ఓ భారతీయుడిని అక్కడి న్యాయస్థానం దోషిగా తేల్చింది. అతడికి 9 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం… భారత్‌కు చెందిన యోగిశ్ కె పంచోలి (43) మిచిగాన్‌లో నివాసం ఉంటున్నారు. అతడు“ ష్రింగ్ హోమ్ కేర్ ” అనే కంపెనీని నిర్వహిస్తున్నాడు. అయితే ఈ సంస్థ కొనుగోలుకు తన వివరాలు కాకుండా ఇతరుల పేర్లు, సంతకాలు , వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించాడు.

కేవలం రెండు నెలల వ్యవధి లోనే మెడికేర్ నుంచి దాదాపు 2.8 మిలియన్ డాలర్లును పొందాడు. తాను ఎలాంటి సేవలు అందించకుండానే ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేశాడు. తన స్నేహితుల సాయంతో ఈ నిధులను డొల్ల కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. అక్కడి నుంచి భారత్ లోని పంచోలి ఖాతా లోకి మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

దీనిపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ విచారణ చేపట్టగా అంతకు ముందే నిందితుడు తన పేరు మార్చుకుని , సాక్షిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వివిధ ప్రభుత్వ శాఖలకు మెయిల్స్ పంపించాడు. అయితే ఈ కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చింది. హెల్త్ కేర్‌లో మోసం, వ్యక్తిగత సమాచారం దొంగిలించడం, నిధుల మళ్లింపు, సాక్షులపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని పరిగణన లోకి తీసుకొని పంచోలికి తొమ్మిదేళ్లు జైలు శిక్ష విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News