Monday, December 23, 2024

డోర్‌స్టెప్ డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఐకియా

- Advertisement -
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన స్వీడిష్ ఓమ్నిచానెల్ గృహోపకరణాల రిటైలర్ ఐకియా , తమ ఈ-కామర్స్ డెలివరీలను మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 62 జిల్లాల్లో వేల సంఖ్యలో పిన్ కోడ్‌లకు ప్రారంభించినట్లు వెల్లడించింది. ఐకియా స్టోర్‌ల వద్ద షాపింగ్ చేయడానికి సమీపంలోని నగరాలు, పట్టణాల నుండి వస్తోన్న వేలాది మంది కస్టమర్‌ల ఉత్సాహం, డిమాండ్, సందర్శనలను చూస్తూనే ఉన్నందున ఈ సేవల విస్తరణ జరిగింది.

ఈ కొత్త కస్టమర్ మీటింగ్ పాయింట్‌లు 7,500కి పైగా చక్కగా రూపొందించబడిన, సరసమైన, మంచి నాణ్యత, పనితీరు, స్థిరమైన గృహోపకరణ ఉత్పత్తులతో పాటు ఇంటి కోసం ఆచరణాత్మక పరిష్కారాలను అందిస్తాయి. కస్టమర్‌లు ఐకియా యాప్‌ని ఉపయోగించి తమకు ఇష్టమైన ఉత్పత్తులను శోధించగలరు, కనుగొనగలరు, కొనుగోలు చేయగలరు, బ్రాండ్ వెబ్‌సైట్ www.ikea.in ద్వారా లేదా దాని “షాప్ బై ఫోన్ ” సహాయ సేవ ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు.

సుసానే పుల్వెరెర్, సీఈఓ & సీఎస్ఓ (చీఫ్ సస్టైనబిలిటీ ఆఫీసర్), ఐకియా ఇండియా మాట్లాడుతూ.. “ఐకియా గత ఐదు సంవత్సరాలుగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి అశేష సంఖ్యలో కస్టమర్ ప్రేమ, నమ్మకాన్ని పొందింది. ఈ మార్కెట్‌లలో మా పరిధిని మరింత విస్తరించడం అంటే మా కస్టమర్‌లకు ఐకియా ని మరింత అందుబాటులోకి తీసుకురావడం, మరింత సౌకర్యవంతంగా మార్చటం, నిజంగా ఓమ్నిఛానెల్ చేయడం. ఈ-కామర్స్‌లో గొప్ప సంభావ్యతను మేము చూస్తున్నాము, ఎక్కువ మంది భారతీయులకు మా పరిష్కారాలను అందించటానికి అది స్ఫూర్తినందిస్తుంది. ఈ రాష్ట్రాల్లోని మా ప్రస్తుత భౌతిక స్టోర్స్ యొక్క పంపిణీ సామర్థ్యాలపై ఆధారపడి ఆన్‌లైన్ ఛానెల్‌ల నుండి వస్తోన్న డిమాండ్‌ను అందుకోనున్నాము. ఈ అభివృద్ధి చెందుతున్న నగరాలు ఆన్‌లైన్ రిటైల్ వృద్ధికి కీలకమైన కేంద్రాలు, భారతదేశంలోని మా అనేక మంది కస్టమర్‌ల ఇళ్ల వద్దకే ఐకియా అనుభవాన్ని తీసుకురావడానికి మేము సంతోషిస్తున్నాము” అని అన్నారు.

కస్టమర్‌లు ఐకియా యాప్, వెబ్‌సైట్‌ను సులభంగా అన్వేషించవచ్చు, ఇవి హోమ్ ఇన్‌స్పిరేషన్ డిజైన్‌లు, ప్రోడక్ట్ ఫీడ్, రేటింగ్‌లు, రివ్యూల ద్వారా ఇంట్లో మెరుగైన జీవితాన్ని సృష్టించడంపై దృష్టి పెడతాయి. వారు ఐకియా ఫ్యామిలీ మెంబర్‌గా సైన్ అప్ చేసిన తర్వాత ఆఫర్‌లను బ్రౌజ్ చేయవచ్చు. ఉత్పత్తులపై ప్రత్యేక తగ్గింపులతో పాటు నూతన తక్కువ ధరలను అన్వేషించవచ్చు. ఇంకా, కస్టమర్‌లు వెబ్‌సైట్‌లోని కస్టమర్ సర్వీస్ సెక్షన్‌ని సందర్శించడం ద్వారా వంటగది ప్లానింగ్, లివింగ్ రూమ్ ప్లానింగ్, ఇంటీరియర్ డిజైన్ సర్వీసెస్, పర్సనల్ షాపర్ మొదలైన సేవలను కూడా తమ ఇళ్లలో సౌకర్యవంతంగా పొందవచ్చు.

ఈ మార్కెట్‌లలో ఐకియా ఆకృతికి,దాని ఔచిత్యాన్ని బలోపేతం చేయడానికి సహాయపడే హోమ్ ట్రెండ్‌ల గురించి సుసానే మాట్లాడుతూ.. “భారతీయులు తమ ఇళ్ల పట్ల చాలా సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి శారీరక, భావోద్వేగ, మానసిక శ్రేయస్సుకు ఇది ఒక ముఖ్యమైన తోడ్పాటుదారునిగా చూస్తారు. మా ఇటీవలి ‘లైఫ్ ఎట్ హోమ్’ నివేదిక , మెరుగైన స్టోరేజ్ పరిష్కారాల కోసం, మంచి నిద్రపై దృష్టి పెట్టడం కోసం భారతీయ గృహాల అవసరాలను ప్రధానంగా వెల్లడి చేసింది. ఇంటి వద్ద మెరుగైన జీవితాన్ని సృష్టించడం కోసం మా వద్ద అనేక పరిష్కారాలు ఉన్నాయి . ఇప్పుడు అవి అందరికీ అందుబాటులో ఉండేలా, సరసమైన ధరలో లభిస్తాయని మేము నిర్ధారిస్తున్నాము” అని అన్నారు.

ప్రస్తుతం, మాకు వస్తోన్న 72% కస్టమర్ ఆర్డర్‌లను ప్రస్తుత మార్కెట్‌లలో ఎలక్ట్రికల్ వెహికల్స్ ద్వారా ఫుల్ ఫిల్ చేస్తున్నాము. ఈ విస్తరణతో, ఐకియా దాని సరఫరా గొలుసులో మరింతగా సామర్థ్యాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది, తద్వారా మరింత పర్యావరణ అనుకూలంగా మార్చనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News