ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
బెంగళూరు: విమానంలో హానికర ద్రవం తాగి తీవ్ర అస్వస్థతకు గురై అర్ధాంతరంగా ఆసుపత్రిలో చేరిక టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ప్రస్తుతం కోలుకున్నాడు. అతని ఆరోగ్యం నిలకడగా ఉండడంతో అగర్తాలా అసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. బుధవారం మయాంక్ బెంగళూరుకు చేరుకున్నాడు. మయాంక్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రంజీ ట్రోఫీలో కర్ణాటక టీమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మయాంక్ త్రిపురతో జరిగిన మ్యాచ్ అనంతరం తన జట్టు సభ్యులతో కలిసి ఢిల్లీ బయలుదేరాడు.
విమానంలో కూర్చుని తన ముందున్న హానికర ద్రవాన్ని మంచి నీళ్లు అనుకుని తాగాడు. దీంతో మయాంక్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ద్రవం కారణంగా గొంతులో బొబ్బలు వచ్చినట్టు వైద్యులు గుర్తించి వెంటనే అగర్తాలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం మయాంక్ ఆరోగ్యం నిలకడగా ఉంది. దీంతో బుధవారం అతన్ని బెంగళూరుకు తరలిచించారు. కాగా, కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి మయాంక్ ధన్యవాదాలు తెలిపాడు.