Monday, December 23, 2024

500 మంది మహిళలతో భర్తకు సంబంధం?… హైకోర్టులో భార్య పిటిషన్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఓ భార్య తన భర్తకు ఐదు వందల మహిళలతో వివాహేతర సంబంధం ఉందని మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆర్తి అనే యువతి వివేక్ రాజ్‌ను పెళ్లి చేసుకుంది. ఒక రోజు భర్త సెల్‌ఫోన్ తీసుకొని ఫొటోలు, వీడియోలు చూస్తుండగా అసభ్యకరమైన, అశ్లీలమైన 500 వీడియోలు కనిపించడంతో తన అత్తమామకు తెలియజేసింది. దీంతో భర్త, అత్తమామలు కలిసి ఈ విషయం ఎవరికి చెప్పవద్దని ఆమెను బెదిరించారు. అప్పుడు తాను రెండు నెలల గర్భిణీగా ఉన్నానని, తనపై భర్త దాడి చేయడంతో అబార్షన్ అయిందని తంజావూరు ఆల్ వుమెన్ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో స్థానిక మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో ఫిటిషన్ వేసింది. ఈ కేసును సిబిసిఐడితో విచారణ చేపట్టాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే విచారణను వాయిదా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News