Monday, December 23, 2024

కొండా సురేఖతో కర్మన్‌ఘాట్ ఆంజనేయ స్వామి ట్రస్ట్ బోర్డు సభ్యుల భేటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : కర్మన్ ఘాట్ శ్రీ ధ్యాన ఆంజనేస్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు, అర్చుకులు గురువారం సచివాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి స్వామి వారి ప్రసాదం, శేష వస్త్రాలు సమర్పించి, ఆశీర్వచనాలను అందించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు వివరించి ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా మంత్రిని ఆహ్వానించారు. మంత్రిని కలిసిన వారిలో ఆలయ ఈవో శ్రీనివాస శర్మ, ప్రధాన అర్చకులు అంబ ప్రసాద్ తదితరులు ఉన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News