- Advertisement -
కీవ్ : రష్యాకు చెందిన మిసైల్ బోట్‌ను తాము ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. నల్ల క్రిమియాలో చేపట్టిన ఓ స్పెషల్ ఆపరేషన్‌లో భాగంగా నల్లసముద్రంలో ది ఇవనోవెట్స్ అనే చిన్నసైజు యుద్ధ నౌకను తమ క్షిపణులు నేరుగా తాకాయని ఉక్రెయిన్ పేర్కొంది. దీంతో అది భారీ పేలుడుకు గురై పూర్తిగా మునిగి పోయినట్టు వెల్లడించింది. దీనికి సంబంధించిన దృశ్యాలను ఉక్రెయిన్ విడుదల చేసింది. రష్యా మిలిటరీ బ్లాగర్ దీనిపై స్పందిస్తూ మూడు క్షిపణులు తాకడంతో బోటు మునిగిపోయిందని పేర్కొంది. ఈ మిసైల్ బోటు ఖరీదు 70 మిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చు.
- Advertisement -