Monday, December 23, 2024

‘ఆ నిధులను ఏం చేశావు జగన్’

- Advertisement -
- Advertisement -

అమరావతి: అమ్మ పెట్టదు అడుక్క తిననివ్వదన్నట్లుగా జగన్ ప్రభుత్వం తీరు ఉందని బిజెపి నేత సత్య కుమార్ విమర్శించారు. శుక్రవారం సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. ఎపిలో రహదారుల పరిస్థితి దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. విసిగిపోయి ప్రజలే సొంత నిధులతో ఏర్పాటు చేసుకునే పరిస్థితి వచ్చిందని, వైసిపి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇదొక చిన్న ఉదాహరణే అని సత్య కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారుల కోసం అప్పుల రూపంలో తెచ్చిన వైలు కోట్లు ఏమి చేసినట్టు అని ప్రశ్నించారు. ఆ నిధులన్నీ ఏ దారిలో ఎవరి జెబుల్లోకి వెళ్తున్నాయని సత్య కుమార్ అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News