- Advertisement -
విశాఖపట్నం:డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 55 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 196 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగాడు. జైస్వాల్ 168 బంతుల్లో 117 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ 27 పరుగులు చేసి టామ్ హార్ట్‌లే బౌలింగ్‌లో ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్ రూపంలో ఔటయ్యాడు. భారత బ్యాట్స్‌మెన్లు రోహిత్ (14), శుభ్‌మన్ గిల్(34), శ్రేయస్ అయ్యర్(27) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్(117), రజత్ పాటిదర్(4) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
- Advertisement -