Tuesday, December 3, 2024

ఏనుగుతో సెల్ఫీ దిగబోయి… (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

‘పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో,  చూస్కో. పులితో ఫోటో దిగాలని అనిపించిందనుకో, కొంచెం రిస్కయినా పర్లేదు ట్రై చేయచ్చు. చనువు ఇచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది’అని జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమాలో డైలాగ్ చెబుతాడు. సరే.. మన అభిమాన హీరో చెప్పాడు కదా అనుకున్నారో ఏమో.. సెల్ఫీ తీసుకోబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు ఇద్దరు వ్యక్తులు. కాకపోతే వాళ్లు సెల్ఫీ తీసుకోవాలనుకున్నది పులితో కాదు.. ఏనుగుతో.

కర్నాటకలోని బందీపూర్ వాయనాడ్ జాతీయ పార్కుకు వెళ్లిన ఇద్దరు పర్యాటకులు ఏనుగు దాడినుంచి చావుతప్పి కన్నులొట్టబోయిన విధంగా త్రుటిలో తప్పించుకున్నారు. అటుగా వస్తున్న ఓ ఏనుగుతో వారిద్దరూ సెల్ఫీ దిగాలనుకున్నారు. అయితే ఒక్కసారిగా ఆ ఏనుగు పరుగు పరుగున వీరి వద్దకు రావడంతో వారు పరుగు లంకించుకున్నారు. ఈ క్రమంలో ఒకతను కిందపడిపోయాడు. అతన్ని కాలితో తొక్కి చంపేందుకు ఏనుగు ప్రయత్నించింది. ఈలోగా ఏదో చప్పుడు వినిపించడంతో అకస్మాత్తుగా వెనుదిరిగివెళ్లిపోయింది. దాంతో కిందపడిన వ్యక్తి బతుకుజీవుడా అంటూ పడుతూ లేస్తూ పారిపోయాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News