- Advertisement -
హైదరాబాద్ : అమెరికాలో ఓ తెలుగు యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన బినిగిరి శ్రేయాస్ రెడ్డి (19) కొన్నాళ్ల క్రితం ఒహిమాకు వెళ్ళాడు. అక్కడ లిండర్ బిజినెస్ స్కూల్లో చదువుకుంటున్నాడు. కాగా క్యాంపస్లో ఉబర్ డ్రైవర్ వదిలిపెట్టిన కొద్దిసేపటికే శ్రేయాస్ రెడ్డి చనిపోయాడు. దాంతో శ్రేయస్ రెడ్డి మృతిపై అతని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వెంటనే శ్రేయాస్ రెడ్డి తండ్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. శ్రేయాస్ రెడ్డి వద్ద అమెరికన్ పాప్ పోర్టు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా అమెరికాలో చదువుకుంటున్న భారత విద్యార్థులు చనిపోవడం ఇది నాలుగో కేసు కావడం గమనార్హం.
- Advertisement -