కమిటీ అర్జీపై వెసులుబాటు కల్పించని హైకోర్టు
కేసుపై 6న కోర్టు విచారణ
ప్రయాగ్‌రాజ్ : అలహాబాద్ హైకోర్టు జ్ఞానవాపి మసీదు కమిటీకి శుక్రవారం వెంటనే ఎటువంటి వెసులుబాటూ కల్పించలేదు. మసీదు నేలమాళిగలో హిందువుల ప్రార్థనలను అనుమతిస్తూ వారణాసి కోర్టు జారీ చేసిన ఉత్తర్వును కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ వ్యవహారంపై ఈ నెల 6న కోర్టు విచారణ జరుపుతుంది. మసీదు వ్యవహారాల చూసే కమిటీ దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిపిన జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ఆ ఉత్తర్వు జారీ చేశారు.
వారణాసి జిల్లా కోర్టు ఉత్తర్వుపై తాము జారీ చేసిన అభ్యర్థనపై విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించిన కొన్ని గంటలలోనే అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టుకు వెళ్లవలసిందని కమిటీని సుప్రీం కోర్టు ఆదేశించింది. జ్ఞానవాపి మసీదు దక్షిణ నేలమాళిగలో విగ్రహాలకు ఒక అర్చకుడు ప్రార్థనలు చేయవచ్చునని వారణాసి కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.