- Advertisement -
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని బిఆర్ఎస్ కసి మీద ఉంది. మరోపక్క పార్టీలో అసంతృప్తి నేతలు పెరిగిపోతున్నారు. తాజాగా కొత్తగూడెం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. శనివారం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో గందరగోళం నెలకొంది. జై రాఘవ అంటూ కార్యకర్తల నినాదాలు చేశారు. మరోపక్క వనమా రాఘవ మీద సస్పెన్షన్ ఎత్తివేయాలని నినాదాలు వినిపించాయి. కారుకు సరైన డ్రైవర్ లేకపోవడం వల్లనే ఓడిపోయామంటూ సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఘటనలపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.
- Advertisement -